కమ్మగా కూసింది కోయిలమ్మ సిగ్గుగానవ్వింది ముద్దుగుమ్మ -hymavati Tue Oct 01 2013 17:02:07 GMT-0700 (PDT)

posted Oct 1, 2013, 5:02 PM by A Billion Stories
కమ్మగా కూసింది కోయిలమ్మ సిగ్గుగానవ్వింది ముద్దుగుమ్మ

మల్లె మందారాలు సన్నజాజుల తొను
సంపెంగ విరజాజి పూల విందుల తోను
పుడమి పులకించె పండు వెన్నెలలోన
వచ్చింది వయ్యారి వాసంత లక్ష్మి ..కమ్మగా

వీణమీటినలా వేణునాద రవళిలా
మందహాసము చేసె అందాల ఆమని
కన్నె మనసున పలికె ప్రేమ రాగాలేవో
సిగ్గు దొంతర లోన మదుర భావాలేవో ..కమ్మగా


యమునా తీరాన రాస లీలల తేలు
చిలిపి కృష్ణుని తీరు తలచెనేమొ
గున్న మామిడి పైన గువ్వ జంటల వలపు
గుట్టుగా గుర్తుకి వచ్చెనేమొ ..కమ్మగా

మృదు మదుర భావాలు పిల్ల గాలుల తేలి
మూగ బాసలలొన మురిపించెనెంధుకో
ఊహలలో వరుని రూపు ఊరించెనేమొ ..కమ్మగా
-hymavati

Submitted on: Sun Jun 23 2013 04:42:44 GMT-0700 (PDT)
Category: Original
Language: Telugu
Copyright: Reserved
Submit your own work at http://www.abillionstories.com
Read submissions at http://abilionstories.wordpress.com
Submit a poem, quote, proverb, story, mantra, folklore in your own language at http://www.abillionstories.com/submit
Comments